వచ్చే ఏడాది భారత్‌లోకి టెస్లా కార్లు
close

Published : 29/12/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వచ్చే ఏడాది భారత్‌లోకి టెస్లా కార్లు

ధ్రువీకరించిన నితిన్‌ గడ్కరీ

దిల్లీ: అమెరికా విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి 2021లో ప్రవేశించనుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం ధ్రువీకరించారు. గిరాకీని బట్టి తయారీ యూనిట్‌ సైతం నెలకొల్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2030 కల్లా రూ.8 లక్షల కోట్ల ముడి చమురు దిగుమతులతో పాటు కర్బన ఉద్గారాలను 30-35 శాతం తగ్గించుకోవడం కోసం, విద్యుత్‌ కార్లకు భారత్‌ ప్రోత్సాహం ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన వాహన కంపెనీగా ఉన్న టెస్లా భారత్‌లో విక్రయ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. అమ్మకాలకు వచ్చే స్పందనను బట్టి స్థానికంగా అసెంబ్లింగ్‌, తయారీని పరిశీలిస్తుంది. వచ్చే అయిదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీదారుగా మారే సత్తా భారత్‌కు ఉంద’ని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీ తెలిపారు.డిజిటల్‌ రిటైలింగ్‌ ద్వారా విక్రయాలను నేరుగా కంపెనీయే పర్యవేక్షించనుంది. టెస్లా పోర్ట్‌ఫోలియోలోని ‘మోడల్‌ 3’ వాహనం మన మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.55-60 లక్షల వరకు ఉండొచ్చు.  
69,000 పంపుల్లో ఇ-ఛార్జింగ్‌ కియోస్క్‌లు: ‘2030 కల్లా ప్రైవేటు కార్లలో 30%; వాణిజ్య కార్లలో 70%, బస్సుల్లో 40%; ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80% మేర విద్యుత్‌ వాహనాల అమ్మకాలు ఉండేలా వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు గడ్కరీ వివరించారు. 69,000 పెట్రోలు పంపుల్లో కనీసం ఒక ఇ-ఛార్జింగ్‌ కియోస్క్‌ ఏర్పాటు చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని