విమానంలో తరలివచ్చిన శాటిలైట్‌
close

Published : 31/12/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విమానంలో తరలివచ్చిన శాటిలైట్‌

బ్రెజిల్‌ నుంచి చెన్నైకు చేర్చిన ఎమిరేట్స్‌ కార్గో  

అమెజోనియా-1 శాటిలైట్‌ను బ్రెజిల్‌లోని శావ్‌జోసె దస్‌ కంపోస్‌ విమానాశ్రయం నుంచి చెన్నైకు బుధవారం విజయవంతంగా చేర్చినట్లు ఎమిరేట్స్‌ కార్గో విభాగమైన ‘స్కై కార్గో’ తెలిపింది. దక్షిణ అమెరికా నుంచి తొలిసారిగా శాటిలైట్‌ను ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో రవాణా చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ శాటిలైట్‌ను 2021 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. అంతరిక్షానికి పంపే శాటిలైట్లు, ఇతర కీలక వ్యవస్థలను రవాణా చేయడంలో ఎమిరేట్స్‌ స్కై కార్గోకు విశేష అనుభవం ఉందని ఆ సంస్థ తెలిపింది. ఎమిరేట్‌ ఇంజినీర్లు రూపొందించిన ఖలిఫసత్‌ శాటిలైట్‌ను దుబాయ్‌ నుంచి సియోల్‌కు 2018లో తొలిసారిగా రవాణా చేయడం ద్వారా స్కైకార్గో ఈ సేవలకు శ్రీకారం చుట్టింది.
ఇవీ ప్రత్యేకతలు: 8 సంవత్సరాల పరిశోధనలతో అమెజోనియా-1 శాటిలైట్‌ను పూర్తిగా బ్రెజిల్‌లోనే అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్‌ రెయిర్‌ ఫారెస్ట్‌ (ఉష్ణమండల వర్షారణ్యం) పర్యావరణ వ్యవస్థ ఎలా ఉందో పరిశీలించడం ఈ శాటిలైట్‌ ప్రయోగ లక్ష్యం. ఇంత కీలకమైన శాటిలైట్‌ను సురక్షితంగా రవాణా చేసేందుకు సంస్థ అతిపెద్ద బోయింగ్‌ 777 ఫ్రైటర్‌ను ఎమిరేట్స్‌ వినియోగించింది. శాటిలైట్‌ను పలు భాగాలుగా విడదీసి, జాగ్రత్తగా ప్యాకింగ్‌ చేసి విమానంలోపల అతిపెద్ద కంటైనర్లలో ఉంచి, తీసుకు వచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తం బరువు 22 టన్నులుగా సంస్థ వెల్లడించింది. తొలుత బ్రెజిల్‌లోని శావ్‌జోసె దస్‌ కంపోస్‌ నుంచి దుబాయ్‌కి, అక్కడ నుంచి చెన్నైకు చేర్చారు. ఈ రవాణాకు ముందుగా సిమ్యులేషన్‌ పద్ధతిలో రెండుసార్లు పరీక్షించుకున్నట్లు వివరించింది.

బోయింగ్‌ 777 ఫ్రైటర్‌లో.. 1.07 లక్షల కిలోలు
సరకు రవాణా సామర్థ్యం 10 గంటలు, 9070 కిలోమీటర్లు (4900 నాటికల్‌ మైళ్లు)
విరామం లేకుండా ప్రయాణం


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని