టయోటా కొత్త ఫార్చునర్‌
close

Published : 07/01/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టయోటా కొత్త ఫార్చునర్‌

ప్రారంభ ధర రూ.29.98 లక్షలు
లెజెండర్‌ రూ.37.58 లక్షలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) తన ప్రీమియం ఎస్‌యూవీ ఫార్చునర్‌లో కొత్త వెర్షన్‌ను, హై-ఎండ్‌ రకంలో లెజెండర్‌ మోడల్‌ను విపణిలోకి విడుదల చేసింది. కొత్త వెర్షన్‌ ఫార్చునర్‌లు 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతాయి. 2.7 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 5-స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తోనూ రూపొందినట్లు కంపెనీ తెలిపింది. మాన్యువల్‌ పెట్రోల్‌ ట్రిమ్‌ రకం రూ.29.98 లక్షలు కాగా, ఆటోమేటిక్‌ వెర్షన్‌ ధర రూ.31.57 లక్షలు. మాన్యువల్‌ 2-వీల్‌ డీజిల్‌ ట్రిమ్‌ రకం ధర రూ.32.48 లక్షలు కాగా, ఆటోమేటిక్‌ వేరియంట్‌ ధర రూ.34.84 లక్షలు. మాన్యువల్‌ 4-వీల్‌-డ్రైవ్‌ వెర్షన్‌ ధర రూ.35.14 లక్షలు కాగా, ఆటోమేటిక్‌ ధర రూ.37.43 లక్షలు. లెజెండర్‌లో డీజిల్‌ పవర్డ్‌ 2-వీల్‌ డ్రైవ్‌ ఇంజిన్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ధర రూ.37.58 లక్షలు. ఫార్చునర్‌, లెజెండర్‌ల బుకింగ్‌లు మొదలయ్యాయని కంపెనీ తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని