దిల్లీ: బంగారం, వెండి లేదా రత్నాభరణాలను నగదు ఇచ్చి కొనుగోలు చేసే వారందరికీ కొత్త కేవైసీ నిబంధనలు వర్తించవని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అధిక విలువ నగదు లావాదేవీలకు మాత్రం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్), ఆధార్ వంటి ధ్రువీకరణలు ఇవ్వాల్సి వస్తుందని రెవెన్యూ విభాగం 2020 డిసెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంటోంది. ఆభరణాలు, మేలిమి బంగారం, విలువైన రత్నాలను రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదుతో కొనుగోలు చేయాలంటే కేవైసీ ఉండాల్సిందే. కొన్నేళ్లుగా అమలవుతున్న ఈ విధానం కొనసాగుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద డిసెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ద్వారా బంగారం, వెండి, ఆభరణాలు, విలువైన రాళ్లను కొనుగోలు చేసే వ్యక్తులు, లేదా సంస్థలు కేవైసీ పత్రాలు నింపాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరి అని తెలిపింది.
ఇవీ చదవండి..
రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ల అమ్మకాలు
గృహ రుణాల వడ్డీపై0.3% వరకు రాయితీ : ఎస్బీఐ
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?