close

Updated : 16/01/2021 09:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వాహన తుక్కు విధానానికి త్వరలోనే ప్రభుత్వ అనుమతి

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ

దిల్లీ: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాహన తుక్కు విధానానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 15 ఏళ్ల పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఈ విధానం దోహదం చేయనుంది. ‘విద్యుత్‌ వాహనాలకు గిరాకీ పెంచేందుకు వీలుగా మోటార్‌ వాహన నిబంధనలకు సవరణలు చేస్తూ 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రతిపాదనను 2019 జులై 26న తీసుకొచ్చాం. దాన్ని ప్రభుత్వానికి సమర్పించాం. త్వరలోనే వాహన తుక్కు విధానానికి అనుమతి లభిస్తుంద’ని గడ్కరీ తెలిపారు. ఈ తుక్కు విధానంలో 15 ఏళ్లు వినియోగించిన కార్లు, ట్రక్కులు, బస్సుల్ని తుక్కుగా మార్చాల్సిన అవసరం ఉంటుందని ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2020-21 కార్యక్రమంలో వెల్లడించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని