డాక్టర్ రెడ్డీస్ వెల్లడి
దిల్లీ: భారత్లో ‘స్పుత్నిక్ వి’ టీకా మూడో దశ క్లినికల్ పరీక్షలకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతులు ఇచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. దేశంలో 1500 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది. రెండో దశ క్లినికల్ పరీక్షలకు సంబంధించిన డేటాను డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డు(డీఎస్ఎమ్బీ) ఈ వారం మొదట్లో సమీక్షించింది. మూడో దశకు సిఫారసు చేసింది. భద్రతపరంగా ఎటువంటి ప్రతికూలతలు కనిపించలేదని.. ప్రాథమికంగా అన్ని ప్రమాణాలను ఈ పరీక్షల్లో పాటించినట్లు తన నివేదికలో డీఎస్ఎమ్బీ పేర్కొంది. ‘టీకా పరీక్షల్లో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఈ నెలలోనే మూడో దశ పరీక్షలను మొదలుపెట్టాలని భావిస్తున్నాం. భారత ప్రజలకు అత్యంత భద్రమైన, సమర్థవంతమైన టీకాను తీసుకురావడానికి మా వేగవంతమైన చర్యలను కొనసాగిస్తామ’ని డాక్టర్ రెడ్డీస్ సహ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. సెప్టెంబరు 2020లో ఈ కంపెనీ భారత్లో పంపిణీ హక్కుల నిమిత్తం స్పుత్నిక్ వి టీకాకు క్లినికల్ పరీక్షలను నిర్వహించడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?