close

Published : 16/01/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మొబైల్‌ నంబరుకు ముందు సున్నా చేర్చాలి

ల్యాండ్‌లైన్‌ నుంచి కాల్స్‌ చేసేటప్పుడు తప్పనిసరి

దిల్లీ: ల్యాండ్‌లైన్‌ నుంచి మీరు ఎవరి మొబైల్‌ ఫోనుకైనా కాల్‌ చేస్తున్నారా? అయితే ఫోను నంబరు డయల్‌ చేసేటప్పుడు ఆ నంబరుకు ముందు తప్పకుండా సున్నా చేర్చండి. టెలికాం విభాగం ఆదేశాలను అనుసరించి ఈ నెల 15వ తేదీ నుంచి మొబైల్‌ నంబరుకు సున్నా చేర్చడాన్ని తప్పనిసరి చేస్తూ ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు కంపెనీలు సమాచారం ఇస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇప్పటికే సమాచారం ఇవ్వడాన్ని ప్రారంభించగా.. రిలయన్స్‌ జియో సంక్షిప్త సందేశాలను (ఎస్‌ఎమ్‌ఎస్‌లు) పంపిస్తోంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని