థెలెస్తో బీడీఎల్ ఒప్పందం
హైదరాబాద్ యూనిట్లో ఉత్పత్తి కేంద్రం
ఈనాడు, హైదరాబాద్ : భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఎగుమతుల పరంగా మరో కీలక అడుగు వేసింది. బ్రిటిష్ సైన్యంతోపాటూ ప్రపంచ రక్షణ దళాలు వినియోగిస్తున్న స్టార్‌స్ట్రీక్ క్షిపణి వ్యవస్థ ఉత్పత్తిలో భాగస్వామిగా మారింది. సాయుధ హెలికాప్టర్లతో పాటు గగనతల లక్ష్యం ఏదైనా చేధించే సామర్థ్యం కల్గిన అత్యంత వేగవంతమైన క్షిపణి ఇది. ఈ క్షిపణిని యూకేకు చెందిన థెలెస్ సంస్థతో కలిసి హైదరాబాద్ యూనిట్లో ఉత్పత్తి చేసి యూకే, ఇతర దేశాలకూ ఎగుమతి చేసేలా బీడీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్, బ్రిటిష్ ప్రభుత్వాల మద్దతుతో ఈ మేరకు బృంద ఒప్పందంపై సంతకం చేసినట్లు బీడీఎల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
రక్షణ ఎగుమతులతో ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న బీడీఎల్‌కు తాజా ఒప్పందం ఊతమిస్తుంది. స్టార్‌స్ట్రీక్ క్షిపణి గ్లోబల్ సప్లై చైన్‌లో బీడీఎల్ భాగం అయ్యేందుకు అవకాశాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో కొత్త దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ ఒప్పందం ఉపకరిస్తుంది. ఈ సాంకేతికత బదిలీతో భారత్‌లో తయారీకి మార్గం సుగమం అయ్యింది. 60 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి భారత్ రక్షణ దళాలకు ఈ క్షిపణిని అందించవచ్చు. భారత్, యూకే మధ్య పారిశ్రామిక సహకారానికి అవకాశం కల్పిస్తుంది.
కొత్త వ్యాపార అవకాశాలు..
బీడీఎల్ సీఎండీ కమోడోర్ సిద్ధార్థ్ మిశ్ర మాట్లాడుతూ.. థెలెస్, బీడీఎల్ మధ్య జరిగిన స్టార్‌స్ట్రీక్ క్షిపణి సాంకేతికత బదిలీ ఒప్పందం కీలకమైంది. బీడీఎల్, ఇతర భాగస్వామ్య సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాన్ని సృష్టిస్తుందన్నారు. ఎగుమతి మార్కెట్లోనూ బీడీఎల్ విస్తరించేందుకు దోహదం చేస్తుందన్నారు. భారత్‌లో తయారీ, సులభతర వ్యాపారం, ఇటీవలి ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో విదేశీ సంస్థలతో జట్టు కట్టేందుకు, ఇక్కడ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. తాజా ఒప్పందం ఇరు సంస్థలకు కీలక మైలురాయిగా థెల్స్ సీఈఓ అలెక్స్ క్రెస్వెల్ అభివర్ణించారు. భారత్‌లో స్టార్‌స్ట్రీక్ క్షిపణులను బీడీఎల్ ఉత్పత్తి చేసి యూకేతోసహా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. అవగాహన ఒప్పందంపై బీడీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్.పి.దివాకర్, థెలెస్ సీఈఓ అలెక్స్ క్రెస్వెల్, థెలెస్ ఇండియా కంట్రీ డైరెక్టర్, ఉపాధ్యక్షుడు ఇమాన్యుయేల్ సంతకాలు చేశారు. బీడీఎల్ సీఎండీ కమోడోర్ సిద్దార్థ్ మిశ్ర, యూకే రక్షణ కొనుగోళ్ల మంత్రి జెర్మిక్విన్, యూకే డిఫెన్స్ సెక్యూరిటీ ఎక్స్‌పోర్ట్స్ హెడ్ మార్క్ గోల్డ్సాక్ సమక్షంలో ఒప్పందం కుదిరింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?