వచ్చే 2 త్రైమాసికాలపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రణాళిక
అక్టోబరు- డిసెంబరులో 31% పెరిగిన నికర లాభం
ఆదాయంలో 6.4% వృద్ధి
మధ్యంతర డివిడెండు రూ.4
భవిష్యత్‌లో మరింత రాణిస్తామని కంపెనీ ఆశాభావం
దిల్లీ
‘2021 సంవత్సరాన్ని అమోఘంగా ఆరంభించాం. మేం అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన స్థిర కరెన్సీలో 3.5%, డాలరు రూపేణా 4.4 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. భవిష్యత్‌లో మరిన్ని ఆర్డర్లను కంపెనీ చేజిక్కించుకుంటుందని భావిస్తున్నాం. ఈ ఆర్డర్ల అండతో రానున్న త్రైమాసికాల్లో ఇంతకు మించిన ప్రదర్శనను కనబరచగలం.’
- సి విజయ్‌కుమార్, ప్రెసిడెంట్, సీఈఓ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
వచ్చే రెండు త్రైమాసికాల్లో (4-6 నెలల్లో) 20,000 మందిని నియమించుకునే యోచనలో ఉన్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఆర్డర్ల రాక గణనీయంగా పెరగడం, డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం వేగవంతమైన నేపథ్యంలో అవసరాలకు తగ్గట్లుగా సిబ్బందిని పెంచుకోవాలని కంపెనీ భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇందులో 15 శాతం ఆన్‌షోర్ నియామకాలు కాగా.. మిగిలినవి ఆఫ్‌షోర్ నియామకాలు..ఫ్రెషర్స్‌తో పాటు నైపుణ్య అనుభవం ఉన్న వాళ్లను నియమించుకోనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఇక అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలను కంపెనీ ప్రకటించింది. నికర లాభంలో 31.1 శాతం వృద్ధిని నమోదుచేసింది. 2019లో ఇదే కాలంలో నికర లాభం రూ.3,037 కోట్లు కాగా.. సమీక్షా త్రైమాసికంలో రూ.3,982 కోట్లకు పెరిగింది. ఆదాయం కూడా రూ.18,135 కోట్ల నుంచి 6.4 శాతం అధికమై రూ.19,302 కోట్లకు చేరింది. డిజిటల్, ఉత్పత్తుల విభాగంలో బలమైన వృద్ధి ఇందుకు దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది. రానున్న త్రైమాసికాల్లో మరిన్ని ఆర్డర్లు సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన (జులై-సెప్టెంబరుతో పోలిస్తే) స్థిర కరెన్సీ ప్రకారం.. హెచ్‌సీఎల్ టెక్ ఆదాయం 3.5 శాతం పెరిగింది. కంపెనీ స్వీయ అంచనా అయిన 1.5-2.5 శాతం కంటే కూడా ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 2021 జవనరి- మార్చి త్రైమాసికానికి ఆదాయ వృద్ధి అంచనాను 2-3 శాతానికి (డీడబ్ల్యూఎస్ సంస్థ ఆదాయంతో కలుపుకొని) సవరించింది. ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియాకు చెందిన ఐటీ సొల్యూషన్ల సంస్థ డీడబ్ల్యూఎస్‌ను హెచ్‌సీఎల్ టెక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఫలితాలకు సంబంధించి మరికొన్ని విశేషాలు..
* 2020 సంవత్సరంలో ఆదాయంపరంగా 10 బిలియన్ డాలర్ల మైలురాయిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధిగమించింది. స్థిర కరెన్సీ రూపేణా ఏడాదిక్రితంతో పోలిస్తే అక్టోబరు- డిసెంబరు ఆదాయంలో 3.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. పన్ను వ్యయాలు తగ్గడం ఆదాయంలో వృద్ధికి తోడ్పడిందని కంపెనీ పేర్కొంది.
* జులై- సెప్టెంబరుతో పోలిస్తే నికర లాభం 26.7 శాతం పెరిగింది. ఆ త్రైమాసికంలో కంపెనీ రూ.31,42 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
* రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేరుపై రూ.4 (200%) మధ్యంతర డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
* సమీక్షా త్రైమాసికంలో కంపెనీ 13 ఆర్డర్లను చేజిక్కించుకుంది. లైఫ్‌సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, సాంకేతికత, ఆర్థిక సేవల విభాగాలకు సంబంధించిన ఆర్డర్లు ఇవి.
* 2020 డిసెంబరు చివరినాటికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,59,682. అక్టోబరు- డిసెంబరులో 6,597 మందిని నియమించుకుంది. ఐటీ సేవల విభాగంలో వలసల రేటు 10.2 శాతంగా ఉంది. గతేడాది శ్రీలంక, *వియత్నాంలో డెలివరీ సెంటర్లను కంపెనీ ప్రారంభించింది. రాబోయే 18 నెలల్లో శ్రీలంకలో సుమారు 1,500, వచ్చే మూడేళ్లలో వియత్నాంలో 3,000కు పైగా నియామకాలను చేపట్టనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వెల్లడించింది.
* బీఎస్ఈలో శుక్రవారం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు 3.73% నష్టంతో రూ.989.40 వద్ద ముగిసింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?