ఎన్సీఎల్టీకి నివేదించిన లిక్విడేటర్
లిక్విడేటర్‌ను మార్చాలన్న బ్యాంకుల అభ్యర్థనకు ఎన్సీఎల్టీ తిరస్కరణ
ఈనాడు, హైదరాబాద్: రుణాలు తిరిగి చెల్లించని స్థితిలో లిక్విడేషన్‌కు వెళ్లిన బీఎస్ లిమిటెడ్ వ్యవహారాల్లో బ్యాంకర్ల పాత్ర ఉందని, దీనిపై విచారణకు ప్రయత్నిస్తే తనను తొలగించాలని పిటిషన్ దాఖలు చేశారంటూ లిక్విడేటర్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. రూ.2,506 కోట్ల రుణానికి లోతైన పరిశీలన జరగాల్సి ఉందన్నారు. ఒకవైపు బీఎస్ లిమిటెడ్ సాధారణ ఎంట్రీలతో 2015-2018 మధ్య రూ.944 కోట్ల బకాయిలను మాఫీ చేస్తూ అదే సమయంలో సంస్థకు రూ.215 కోట్ల బ్యాంకు గ్యారంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్లను బ్యాంకులు మంజూరు చేశాయన్నారు. వివిధ సంస్థల నుంచి యంత్రాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా అవి కనిపించడంలేదని, ఇన్వాయిస్లు, ఇన్స్టలేషన్ సర్టిఫికెట్లను, స్థిరాస్తులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని అడిగినా సహకరించడం లేదన్నారు. దివాలా ప్రక్రియలో బీఎస్ లిమిటెడ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదే ప్రస్తుతం దానికి వ్యతిరేకంగా బ్యాంకుల తరఫున వాదనలు వినిపిస్తున్నారన్నారు. కంపెనీ కార్యకలాపాలు, ఆస్తుల గుర్తింపునకు సహకరించడం బ్యాంకర్లకు ఇష్టంలేనందున తొలగింపునకు డిమాండ్ చేస్తున్నాయన్నారు.
బ్యాంకులు ఏమన్నాయంటే..: బీఎస్ లిమిటెడ్ లిక్విడేటర్ యడవల్లి సాయి కరుణాకర్‌ను తొలగించాలని కోరుతూ ఐఎఫ్సీఐ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, ఐడీబీఐ, కెనరా, లక్ష్మీ విలాస్ బ్యాంకులు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ఎన్సీఎల్టీ విచారణ చేపట్టగా లిక్విడేటర్ నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నారని, నిరుపయోగమైన వాటికి చెల్లింపులు చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని బ్యాంకులు తెలిపాయి. బీఎస్ లిమిటెడ్ ఖాతాలను మోసపూరితంగా ప్రకటించి సీబీఐకి ఫిర్యాదు చేశామని, లిక్విడేటర్‌ను మార్చని పక్షంలో తమకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నాయి.
ఇదీ తీర్పు: ఇరుపక్షాల వాదనలను విన్న ట్రైబ్యునల్ రుణదాతల అభ్యర్థన మేరకు లిక్విడేటర్ మార్పు కుదరదని స్పష్టం చేసింది. రుణగ్రస్థ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేయడానికి లిక్విడేటర్‌కు అధికారం ఉందని తెలిపింది. కంపెనీ ఆస్తులను గుర్తించడం, రక్షణ కల్పించడం ప్రధాన బాధ్యత అని, ఇందులో భాగంగా అన్ని పత్రాలు, ఒప్పందాలు, దరఖాస్తులు, బాండ్లు పరిశీలించవచ్చంది. ఐబీ కోడ్ ప్రకారం లిక్విడేషన్ ప్రక్రియ చేపట్టి రుణదాతల ప్రయోజనాల పరిరక్షణలో భాగంగా కంపెనీ ఆస్తులకు గరిష్ఠ విలువలను రాబట్టే స్వేచ్ఛ లిక్విడేటర్‌కు ఉందంటూ బ్యాంకర్ల అభ్యర్థనను తిరస్కరించింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?