సమీక్ష: గరిష్ఠ స్థాయుల్లో కొంత లాభాల స్వీకరణ ఎదురుకావడంతో గతవారం మార్కెట్లు స్థిరీకరించుకున్నాయి. దేశీయ, అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. రాబోయే బడ్జెట్లో మూలధన లాభాల పన్నులు పెంచొచ్చన్న అంచనాలు కలవరపెట్టాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.5 శాతం లాభంతో 49,034 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.6 శాతం పెరిగి 14,433 పాయింట్ల దగ్గర స్థిరపడింది.విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.7,637 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.7,445 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఇప్పటివరకు భారత మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నికరంగా రూ.14,886 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీల్లో రూ.18,490 కోట్లు చొప్పించగా, డెట్ విభాగంలో రూ.3,624 కోట్లు మేర వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:2గా నమోదు కావడం.. చిన్న, మధ్య స్థాయి షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ ఎదురుకావడంతో గత వారం మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌కు 48,600 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. స్వల్పకాలంలో 47,594 వద్ద కీలక మద్దతు దక్కే అవకాశం ఉంది. ఈ స్థాయుల దిగువకు చేరితే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. సెన్సెక్స్ 49,600 స్థాయి ఎగువకు చేరితే మరింత లాభపడొచ్చు.
ప్రభావిత అంశాలు: బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లలో ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు, కంపెనీల వ్యాఖ్యలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారంపై అంతర్జాతీయ మార్కెట్లు దృష్టిపెట్టనున్నాయి.ఈ వారం రెండు పబ్లిక్ ఇష్యూలు- ఐఆర్ఎఫ్సీ, ఇండిగో పెయింట్స్ మార్కెట్‌కు రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండియామార్ట్, మైండ్ ట్రీ, సియట్, ర్యాలీస్, అలెంబిక్ ఫార్మా, టాటా కమ్యూనికేషన్స్, హావెల్స్ వంటి దిగ్గజ సంస్థలు త్రైమాసిక ఫలితాలు వెలువరించనున్నాయి. చైనా జీడీపీ, యూరో ఎకనామిక్ సెంటిమెంట్ సూచీ, బ్రిటన్ ద్రవ్యోల్బణం, ఈసీబీ, జపాన్ వడ్డీ రేటు నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లను నడిపించనున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.
తక్షణ మద్దతు స్థాయిలు: 48,365, 47,594, 47,055
తక్షణ నిరోధ స్థాయిలు: 49,657, 50,100, 50,800
సెన్సెక్స్ 48,600 పాయింట్ల దిగువకు చేరితే బలహీనపడొచ్చు.
- సతీశ్ కంతేటి, జెన్ మనీ
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?