close

Published : 18/01/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పామోలిన్‌ ప్రతికూలమే!

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం, వెండి
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం కూడా బలహీనంగానే కనిపిస్తోంది. అయితే రూ.48,253 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువన ముగిస్తే రూ.47,898; రూ.47,269లు తదుపరి మద్దతు స్థాయులుగా నిలుస్తాయి. ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.15,465 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే.. రూ.15,004; రూ.14,919 వరకు దిగివచ్చే అవకాశం ఉంది. వెండి మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.66,948 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.  
ప్రాథమిక లోహాలు
* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.13,791 కంటే ఎగువన చలించకుంటే రూ.13,623; రూ.13,545 వరకు దిగిరావచ్చు.
* రాగి జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.617.15 కంటే ఎగువన కదలాడకుంటే ప్రతికూల ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది. సీసం జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.158 కంటే దిగువన ట్రేడయితే రూ.162.60 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.   జింక్‌ జనవరి కాంట్రాక్టు రూ.218.55కు స్టాప్‌లాస్‌ను సవరించుకుని షార్ట్‌సెల్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు. అల్యూమినియం జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.164.20 కంటే పైన కదలాడకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు.  నికెల్‌ జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.1,367 కంటే ఎగువన చలించకుంటే రూ.1,262; రూ.1,234 వరకు పడిపోయే అవకాశం ఉంది.
ఇంధన రంగం
* సహజవాయువు జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.197.65 కంటే దిగువన కదలాడకుంటే సానుకూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు.
* ముడి చమురు జనవరి కాంట్రాక్టు ఈవారం రూ.3,755 కంటే దిగువన చలించకుంటే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఈవారం కూడా ప్రతికూలంగానే చలించవచ్చు. అయితే రూ.979 స్థాయిపై ఓ కన్నేసి ఉంచాలి.  
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టుకు ఈవారం సానుకూల ధోరణి కొనసాగితే రూ.6,333 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది.  
* జీలకర్ర మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.13,293 దిగువకు రాకుంటే లాంగ్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.  
* సోయాబీన్‌ మార్చి కాంట్రాక్టు ఈవారం రూ.4,555 దిగువన ట్రేడ్‌ కాకుంటే మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుంది.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని