close

Published : 19/01/2021 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లెక్సస్‌ కొత్త సెడాన్‌ ఎల్‌ఎస్‌

ధర రూ.2.22 కోట్లు

దిల్లీ: విలాసవంత కార్ల దిగ్గజం లెక్సస్‌, సెడాన్‌ మోడల్‌ ఎల్‌ఎస్‌లో కొత్త వేరియంట్‌ ‘ఎల్‌ఎస్‌ 500హెచ్‌ నిషిజిన్‌’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.2.22 కోట్లు (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డిస్‌ప్లే స్క్రీన్‌, ఆడియోను నియంత్రించడం వంటి అప్‌డేట్‌లను ఈ కార్లకు తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. నవీకరించిన ఎల్‌ఎస్‌ 500హెచ్‌ ప్రారంభ ధర రూ.1.91 కోట్లుగా ఉంది. ‘ఎల్‌ఎస్‌ 500హెచ్‌ నిషిజిన్‌’ వేరియంట్‌లో ఇంటీరియర్‌ను సంప్రదాయ జపనీస్‌ కళల మిశ్రమంతో రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని