‘డిక్కీ’ జాతీయ అధ్యక్షుడు ఎన్.రవికుమార్
ఈనాడు, హైదరాబాద్: దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో వ్యాపార సౌకర్య కేంద్రాలు (బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్స్- బీఎఫ్సీ) ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని డిక్కీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడైన ఎన్.రవి కుమార్ సోమవారం ఇక్కడ వెల్లడించారు. ప్రస్తుతం ఇలాంటి 7 కేంద్రాలను డిక్కీ నిర్వహిస్తోంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ జన్మదినమైన ఏప్రిల్ 14 నాటికి ఈ కేంద్రాల సంఖ్యను 30 కి పెంచుకోనున్నట్లు రవి కుమార్ తెలిపారు. ఏప్రిల్ 14న డిక్కీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, 35 ఏళ్ల లోపు 5,000 మంది దళిత యువకులను ఎంపిక చేసి, వారి వ్యాపార ప్రణాళికలను బట్టి ఒక్కొక్కరికి రూ.30 లక్షల వరకు నిధులు అందించేందుకు సహకరిస్తామన్నారు. ఇప్పటి వరకు 10,000 మంది దళిత వ్యాపారవేత్తలకు తాము పెట్టుబడి నిధులు సమకూర్చినట్లు, రూ.50 లక్షలకు మించిన వార్షిక టర్నోవర్‌ను వారు నమోదు చేస్తున్నట్లు వివరించారు. రుణాల మంజూరుకు ‘కొలేటరల్ గ్యారెంటీ’ ల విషయంలో బ్యాంకులు సమస్యలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అందుకే డిక్కీ తరఫున నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?