తోడైన అంతర్జాతీయ సంకేతాలు
49000 దిగువకు సెన్సెక్స్
రూ.2.66 లక్షల కోట్ల సంపద ఆవిరి
సమీక్ష
అంతర్జాతీయ ప్రతికూలతలతో బేర్ నిద్రలేచింది. చాలా రోజుల తర్వాత తన ప్రతాపం చూపింది. కొవిడ్-19 కేసులు మళ్లీ అధికమవుతుండటం వల్ల, ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు వణికాయి. ఈ సెగ మన మార్కెట్‌కూ తాకింది. ఫలితంగా మదుపర్ల సంపద రూ.2.66 లక్షల కోట్లు ఆవిరైంది.
వరుసగా రెండో రోజూ మార్కెట్‌పై బేర్ పట్టు బిగిసింది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి వారం కనిష్ఠానికి చేరడం ఇందుకు తోడైంది. అయితే దిగ్గజ షేర్లు ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రాణించడంతో నష్టాలు కొంతమేర తగ్గాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు కోల్పోయి 73.28 వద్ద ముగిసింది. నాలుగో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 6.5 శాతంగా నమోదుకావడంతో షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సియోల్, టోక్యో మాత్రం నష్టపోయాయి. బీఎస్ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ రూ.2.66 లక్షల కోట్లు తగ్గి రూ.192.77 లక్షల కోట్లకు చేరింది.
పడుతూనే ఉంది: సెన్సెక్స్ ఉదయం 49,061.22 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 49,122.23 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. అనంతరం నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం కొంత కోలుకున్నప్పటికీ.. ఆఖరి గంటలో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒకానొకదశలో 48,403.97 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. చివరకు 470.40 పాయింట్ల నష్టంతో 48,564.27 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 152.40 పాయింట్లు క్షీణించి 14,281.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 14,222.80 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది.
* ఆకర్షణీయ ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మెరిసింది. ఇంట్రాడేలో 2.49% పెరిగిన షేరు.. రూ.1503 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.15% లాభంతో రూ.1483.20 వద్ద ముగిసింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?