ధర రూ.57.40 లక్షల నుంచి
దిల్లీ: జర్మనీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్, తన ఎస్యూవీ జీఎల్సీలో 2021 ఎడిషన్ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.57.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. 2021 జీఎల్సీ వేరియంట్ ధర రూ.57.40 లక్షలుగా, జీఎల్సీ 220డీ డీజిల్ వెర్షన్ ధర రూ.63.15 లక్షలుగా ఉన్నాయి. కొత్త మోడల్లో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ-2021 ‘మెర్సిడెస్ మీ కనెక్ట్’, సమీకృత అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, నేవిగేషన్ వ్యవస్థపై పార్కింగ్ లోకేషన్లు, యాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారులోకి ప్రవేశించకుండానే ఏసీ ఆన్ చేసుకునే విధంగా రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి సదుపాయాలను కల్పించారు.
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?