close

Published : 21/01/2021 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓలా ప్లాంటులో 5,000 రోబోలు

విద్యుత్‌ స్కూటర్ల తయారీలో సాంకేతికత కోసం సీమెన్స్‌తో జట్టు

మిళనాడులో ఏర్పాటు చేయనున్న విద్యుత్‌ స్కూటర్ల తయారీ ప్లాంటులో కార్యకలాపాలు కృత్రిమ మేధ ఆధారితంగా ఉంటాయని ఓలా తెలిపింది. వివిధ విభాగాల్లో 5,000 వరకు రోబోలు భిన్న కార్యకలాపాలు నిర్వహిస్తాయని పేర్కొంది. మెటీరియల్‌ సమీకరణ, ప్లాంటులోకి ముడి సరుకు తేవడం, నిల్వ చేయడం, పూర్తయిన స్కూటర్లను లోడింగ్‌ చేయడం వరకు తయారీ ప్రక్రియ పూర్తిగా కృత్రిమ మేధతో జరుగుతుందని ఓలా వెల్లడించింది. ఈ ప్లాంటు వల్ల 10,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది. అత్యంత అధునాతనంగా నిర్మిస్తున్న ఈ ప్లాంటుకు సాంకేతిక సహకారం కోసం సీమెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని