close

Published : 21/01/2021 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నీ ఒకే గొడుగు కిందకు!

బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం

ఈనాడు-దిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)లను సమర్థంగా నిర్వహించడం కోసం వీటన్నిటినీ ఒక హోల్డింగ్‌ కంపెనీ కిందకు తెచ్చే ప్రణాళికపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా 43 ఆర్‌ఆర్‌బీలుండగా.. వీటికి మొత్తం 21,871 శాఖలున్నాయి. వీటన్నిటినీ ఒకే గొడుగు సంస్థ కిందకు తెచ్చేందుకు నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(నాబార్డ్‌), రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)లు ఒక ప్రణాళికకు తుదిరూపునిస్తున్నాయి. ప్రభుత్వం వీటిని ఆమోదిస్తే.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
పెరుగుతున్న నష్టాలు: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు రుణాలివ్వడానికి ప్రత్యేక చట్టం కింద ఆర్‌ఆర్‌బీలు ఏర్పడ్డాయి. వీటి యాజమాన్య నిర్మాణం ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం; ప్రాయోజిత బ్యాంకుకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం చొప్పున వీటిలో వాటాలుంటాయి. 2018-19తో పోలిస్తే 2019-20లో ఆర్‌ఆర్‌బీల మొత్తం నష్టాలు రూ.652 కోట్ల నుంచి మూడురెట్లకు పైగా పెరిగి రూ.2206 కోట్లకు చేరాయి. ‘ఆర్‌ఆర్‌బీలను ఒక గొడుగు సంస్థ కిందకు తీసుకొస్తే.. వాటిని వృత్తినైపుణ్యంతో నడిపే అవకాశం ఉంటుంద’ని ఆ అధికారి పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని