close

Published : 21/01/2021 02:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
50000కి చేరువలో సెన్సెక్స్‌

సమీక్ష

సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో సూచీలు జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్‌ 50000 పాయింట్ల చేరువకు వెళ్లింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణస్వీకారం తర్వాత తాజా ఉద్దీపన చర్యలు ప్రకటించొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీశాయి. అమెరికాకు కాబోయే ఆర్థిక మంత్రిగా భావిస్తున్న జానెట్‌ యెలెన్‌ ఉద్దీపన ప్యాకేజీకి సంకేతాలివ్వడం కలిసొచ్చింది. రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ వంటి దిగ్గజ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు సైతం సానుకూల ప్రభావం చూపాయి.  
సెన్సెక్స్‌ ఉదయం 49,508.79 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 49,874.42 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 393.83 పాయింట్ల లాభంతో 49,792.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 123.55 పాయింట్లు పెరిగి 14,644.70 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభాలతో ముగిశాయి. మారుతీ 2.75%, టెక్‌ మహీంద్రా 2.67%, ఎం అండ్‌ ఎం 1.98%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.98%, రిలయన్స్‌ 1.91%, ఇన్ఫోసిస్‌ 1.70%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.55%, టీసీఎస్‌ 1.32%, ఎస్‌బీఐ 1.32%, హెచ్‌డీఎఫ్‌సీ 1.28% మేర పెరిగాయి.  

అమెరికా మార్కెట్ల దూకుడు: బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి తోడు కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండటంతో, అమెరికా మార్కెట్లు పరుగులు తీశాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.30 గంటలకు డోజోన్స్‌ 230 పాయింట్ల లాభంతో 31,162 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నాస్‌డాక్‌  250 పాయింట్లు దూసుకెళ్లి 13,449 పాయింట్ల దగ్గర కదలాడుతోంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని