close

Published : 21/01/2021 02:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ నుంచి వైస్‌లీ ప్లాట్‌ఫామ్‌

మైక్రోసాఫ్ట్‌తో కలిసి ఆవిష్కరణ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న తాన్లా  ప్లాట్‌ఫామ్స్‌ (గతంలో తాన్లా సొల్యూషన్స్‌), మైక్రోసాఫ్ట్‌తో కలిసి ‘వైస్‌లీ’ అనే బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారిత సిపాస్‌ (కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫామ్‌-యాజ్‌-ఏ-సర్వీస్‌) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. వ్యాపార సంస్థలు ప్రైవేటు కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోడానికి ఇది వీలుకల్పిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ కోసం మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి చేసింది. ‘‘వ్యాపార సంస్థలతో వినియోగదార్లు నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలో సమాచారాన్ని తస్కరించడం, ఇద్దరి మధ్య సంభాషణల్లో అనధికారికంగా దూరడం, ఫిషింగ్‌.. వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. దీని వల్ల ముఖ్యమైన సమాచారం తస్కరణకు గురికావడంతో పాటు, వ్యక్తిగత సమాచార భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇటువంటి సమస్యలకు ఈ ప్లాట్‌ఫామ్‌ పరిష్కారం’’ అని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఛైర్మన్‌ - సీఈఓ ఉదయ్‌ రెడ్డి పేర్కొన్నారు. వ్యాపార సంస్థలతో పాటు, మొబైల్‌ కేరియర్లు, ఓటీటీ సంస్థలు, మార్కెటింగ్‌ సంస్థలు, ఇతర విభాగాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కుబేర్‌నేట్స్‌ సర్వీస్‌, అజూరే కాస్మోస్‌ డీబీ, అజూరే డేటాబ్రిక్స్‌, అజూరే పోస్ట్‌గ్రెస్‌ ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్‌, ఇతర అజూరే సేవలను ‘వైస్‌లీ’ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించుకుంటుంది. ‘వైస్‌లీ’ ప్లాట్‌ఫామ్‌కు క్రిప్టోగ్రఫీ, బ్లాక్‌చైన్‌ ప్రాసెసెస్‌ విభాగాల్లో యూఎస్‌ పేటెంట్స్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ ఆఫీసు నుంచి మూడు పేటెంట్లు లభించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ వెల్లడించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని