వివిధ రంగాల ప్రముఖుల వినతి
కొవిడ్-19 మిగిల్చిన ఆర్థిక విధ్వంసం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ తరుణంలో వస్తున్న బడ్జెట్‌పై సామాన్యుని నుంచి పారిశ్రామికవేత్తలు.. పలు రంగాలకు చెందిన నిపుణులు తమకు ఉపశమన చర్యలు ఏముంటాయో అని ఎదురు చూస్తున్నారు. కొన్ని రంగాలకు చెందిన ప్రముఖులు బడ్జెట్లో తమకు ఏం కావాలనే విషయాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు..
నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం..
కరోనా తర్వాత గత ఏడాది చివరి నుంచీ తయారీ రంగం కొద్దిగా కోలుకుంటోంది. ఇది సాధారణ స్థితికి రావడానికి ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరిగింది. పోటీ వాతావరణంలో నెగ్గుకు రావాలంటే.. సంస్థలకూ ఇది కీలకంగా మారింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ పరిశ్రమకు కొత్త నైపుణ్యాలు ఉన్న నిపుణుల అవసరం ఎంతో ఉంది. బడ్జెట్లో దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. యువతకు నేటి పరిశ్రమకు ఉపయోగపడే కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. విద్యార్థి దశలోనే ఈ దిశగా ప్రయత్నం జరగాలి.
- అమర్ కౌల్, ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్, ఇంగర్‌సోల్ రాండ్ ఇండియా
విద్యుత్ వాహనాలపై సబ్సిడీ
గత కొంతకాలంగా లాజిస్టిక్స్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇ-కామర్స్ మరింత విస్తృతం అవుతుండడంతో ఇందులో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ సేవలు అందుతున్నాయి. కొత్త బడ్జెట్లో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పీ) అమలు మరింత సమర్థంగా జరిగేందుకు సహాయం అందించాలి. గోదాములపై పన్నును కొంత సరళీకృతం చేయాలి. పెట్రోలు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరకు రవాణా సంస్థలు విద్యుత్ వాహనాల (ఈవీ) కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈవీలపై ప్రత్యేక సబ్సిడీలు, రాయితీలు అందించడం వల్ల ఈ రంగానికి మేలు చేసినట్లు అవుతుంది. దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకూ ప్రయోజనం. దేశవ్యాప్తంగా సేవలను అందించే సంస్థలకు కొన్ని నిబంధనలు, చట్టాలను సరళంగా మార్చాలి. సింగిల్ విండో పద్ధతుల్లో దేశ వ్యాప్తంగా కార్యాలయాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలి. మహమ్మారి సమయంలో లాజిస్టిక్ రంగం కీలక భూమిక పోషించింది. దాన్ని గుర్తించి, దీనికి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- కె.సత్యనారాయణ, సహ వ్యవస్థాపకుడు, ఈకాం ఎక్స్‌ప్రెస్.
‘డిజిటల్’ వసతులు పెంచాలి..
విద్య, ఆరోగ్య రంగాల్లో డిజిటల్ అవసరం గణనీయంగా పెరిగింది. లాక్డౌన్లో ప్రతి రంగం డిజిటల్‌పైనే ఆధారపడిన విషయం మనకు తెలిసిందే. ఓపెన్ డిజిటల్ ఎకోసిస్టం (ఓడీఈఎస్)ను ప్రారంభించేందుకు కృషి జరగాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. దీన్ని వినియోగించుకుని, ప్రభుత్వం మరింత పటిష్ఠంగా డిజిటల్ సేవలను అందించడం సాధ్యం అవుతుంది. బడ్జెట్లో ఈ డిజిటల్ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు.. ప్రజల సమాచార భద్రత విషయంలోనూ తగిన చర్యలు ఉండేలా విధాన రూపకల్పనకు బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండాలి.
- రూపా కుడ్వా, మేనేజింగ్ డైరెక్టర్, ఓమిడ్యార్ నెట్వర్క్ ఇండియా
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?