2021-22 బడ్జెట్లో ప్రత్యేక విధానం
బడ్జెట్
దేశీయంగా చిన్నారులు, యువ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో, బొమ్మల (టాయ్) తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక విధానం రూపొందించి వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారీ అవకాశాలున్నా, ఈ రంగాన్ని ఇప్పటివరకు నిర్లక్ష్యం చేశారనే భావన ఉంది.
దేశంలో బొమ్మల తయారీ రంగం ఇప్పటికీ అసంఘటితంగానే ఉంది. దేశవ్యాప్తంగా మార్కెటింగ్ సదుపాయాలు కలిగిన సంస్థలు నాలుగైదు మాత్రమే ఉన్నాయి. దాదాపు 4,000 చిన్న, మధ్య స్థాయి సంస్థలు బొమ్మల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. దేశీయ వినియోగంలో 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉన్నాయి. అత్యధికం చైనా నుంచి వస్తుండగా, శ్రీలంక, మలేషియా, జర్మనీ, హాంకాంగ్, అమెరికాల నుంచీ మరికొన్ని దిగుమతి అవుతున్నాయి. బొమ్మల తయారీలో వినూత్నత తేవడమే లక్ష్యంగా ఇటీవల టాయ్క్యాథన్ పేరిట హ్యాకథాన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, అంకుర సంస్థలకు ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ‘విద్య, మహిళా, శిశుసంక్షేమ శాఖ, వాణిజ్య-పరిశ్రమల శాఖ, ఎంఎస్ఎంఈ, సమాచార శాఖ, ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్’ ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములయ్యాయి.
చౌక పేరిట నాసిరకం దిగుమతులా?
దేశంలోకి దిగుమతి అవుతున్న వాటిలో చౌకగా లభ్యమయ్యే పేరిట నాసిరకం వస్తువులు ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీటివల్ల పిల్లల ఆరోగ్యానికి చేటు కలగవచ్చు. అందుకే నాణ్యత పర్యవేక్షణ పెంచడంతో పాటు, దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు బొమ్మల దిగుమతులపై సుంకాన్ని పెంచింది. అంతర్జాతీయ బొమ్మల విపణిలో మన దేశ వాటా చాలా తక్కువ.. కేవలం 0.5 శాతమే (సుమారు రూ.750 కోట్లు) ఎగుమతులు జరుగుతున్నాయని, అందుకే ఈ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బొమ్మల పరిశోధన, అభివృద్ధి, డిజైన్ కేంద్రాలను ప్రోత్సహించేలా విధాన రూపకల్పన ఉండొచ్చని తెలుస్తోంది. ఇందువల్ల కూడా ఎగుమతులు బాగా పెంచుకోవచ్చు. మొత్తం ప్రపంచానికి ‘టాయ్ హబ్’గా మారేందుకు మన దేశానికి అవకాశాలున్నాయని, ప్రతిభ-సామర్థ్యాలకు కొదవ లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా అంకురాలు ముందడుగు వేయాలని ఇప్పటికే సూచించారు కూడా. అందువల్ల బడ్జెట్లో ఈ రంగానికి కేటాయింపులు తప్పనిసరిగా ఉంటాయని భావిస్తున్నారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?