ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీకి రూ.5.25 కోట్ల గ్రాంటు
close

Published : 27/01/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీకి రూ.5.25 కోట్ల గ్రాంటు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీకి చెందిన ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీ టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్‌కు కేంద్ర ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నుంచి రూ.5.25 కోట్ల ‘నిధి-ఎస్‌ఎస్‌ఎస్‌ సీడ్‌ గ్రాంట్‌’ లభించింది. ప్రాథమిక దశలోని అంకుర సంస్థలకు అండగా నిలిచేందుకు ఈ సొమ్ము వినియోగించాల్సి ఉంది. ఇటువంటి సంస్థలకు మార్కెటింగ్‌ కార్యకలాపాలు, కొత్త వినియోగదార్లను సంపాదించాల్సి రావడం, టెక్నాలజీ వినియోగం, వ్యాపార ప్రణాళిక రూపకల్పన- అమలు... వంటి వివిధ అంశాల్లో నిధులు, ఇతరత్రా మద్దతు అవసరం. ఈ నిధులు అలా వినియోగించాలి. సాంకేతిక రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థలను ఎంపిక చేసి, తమకు అందిన నిధులతో ప్రోత్సహిస్తామని ఎస్‌ఆర్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీ సీఈఓ శ్రీదేవి దేవిరెడ్డి వివరించారు. అంకుర సంస్థలు వీసీ/ ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సంపాదించడం ఎంతో కష్టమైన పని. ఆలోపు కార్యకలాపాలు సాగించలేని పరిస్థితి ఎదురుకాకుండా ఆర్థికంగా అండదండలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిధి-ఎస్‌ఎస్‌ఎస్‌ సీడ్‌ సపోర్ట్‌ పథకాన్ని తీసుకువచ్చింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని