స్టాక్‌ మార్కెట్‌ నుంచి డబ్బులు వెనక్కి వెళ్తాయ్‌
close

Updated : 31/01/2021 08:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్టాక్‌ మార్కెట్‌ నుంచి డబ్బులు వెనక్కి వెళ్తాయ్‌

2024 కల్లా అది జరగొచ్చు
ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్‌

ఈటీవీ భారత్‌: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉండడంతో పాటు.. మంచి వృద్ధిని నమోదు చేయగల సత్తా ఉండడంతో విదేశీ మదుపర్లు మన స్టాక్‌ మార్కెట్లలోకి వస్తున్నారు. డబ్బులు కుమ్మరిస్తున్నారు. అయితే 2024 కల్లా ఈ అదనపు ద్రవ్యలభ్యత మళ్లీ వెనక్కి వెళ్లిపోవచ్చని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అంచనా వేస్తున్నారు. ‘ఈటీవీ భారత్‌కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారొచ్చు. ఈ అంచనాలే విదేశీ మదుపర్లను మన మార్కెట్ల వైపు మళ్లేలా చేస్తున్నాయి. అయితే 2024లో ఈ ధోరణిలో మార్పు రావొచ్చు. స్టాక్‌ మార్కెట్లు ఎపుడూ భవిష్యత్‌ వృద్ధినే చూపిస్తాయి. విదేశీ మదుపర్లు ఇతర దేశాల్లో ప్రతిఫలాలు పొందలేక మనదగ్గరకు వస్తున్నారు. అంతర్జాతీయ వృద్ధితో పోలిస్తే మన దగ్గర కనీసం 6-7 శాతం వృద్ధి రేటు పదేళ్ల పాటు కొనసాగొచ్చు. అందుకే మదుపర్లు అవకాశాల కోసం ఇక్కడకొస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు వారికి ఆ నమ్మకాన్ని ఇస్తున్నాయి. కరోనాను అదుపులో ఉంచే విషయంలోనూ వారు భారత్‌ను గట్టిగా నమ్ముతున్నారు. ఇవన్నీ కలిసి మన మార్కెట్లను ఆల్‌టైం గరిష్ఠాలకు చేర్చాయి. అయితే ఈ ధోరణి దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చు. 2024 దరిదాపుల్లో క్రమంగా వాళ్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో మదుపర్లు జాగ్రత్తగా ఉండాల’ని వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని