పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు
close

Updated : 02/02/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.క్రితం ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం రూ.2.10 లక్షల కోట్లతో పోల్చితే ఇది తక్కువ. కానీ కొవిడ్‌-19, ఇతర అవాంతరాల వల్ల గత ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని రూ.32,000 కోట్లకు ప్రభుత్వం కుదించింది. అందులో ఇప్పటి వరకు రూ.19,499 కోట్లే సమీకరించగలిగారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో  రూ.1 లక్ష కోట్ల విలువకు సరిపడా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రభుత్వ వాటాలను విక్రయిస్తారు. మిగిలిన రూ.75,000 కోట్లను ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా సమకూర్చుకుంటారు. అణు ఇంధనం, అంతరిక్షం-  రక్షణ, రవాణా, టెలికాం, విద్యుత్తు, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజ రంగాల కంపెనీలను ఇందుకు ఎంపిక చేస్తారు.
* బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంకు, బీఈఎంఎల్‌, పవన్‌ హన్స్‌, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌..తదితర ప్రభుత్వ రంగ సంస్థలో వాటా విక్రయాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపడతారు.
* ఐడీబీఐ బ్యాంకుతో పాటు రెండు ప్రభుత్వ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరిస్తారు.
* ఎల్‌ఐసీ ఐపీఓ కోసం చట్టసవరణను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చేపడతారు.
ఎయిర్‌ ఇండియా విక్రయం: ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల విక్రయాన్ని 2021-22లో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీని కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ), ఎయిర్‌ ఇండియా అస్సెట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు రూ.2,268 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

 


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని