ప్రారంభ ధర రూ.14.69 లక్షలు
దిల్లీ: స్పోర్ట్స్ వినియోగ వాహన (ఎస్యూవీ) విపణిలో మరింత విస్తరించడం కోసం టాటా మోటార్స్ సోమవారం సరికొత్త సఫారీని ప్రవేశపెట్టింది. ఈ వాహన ధరల శ్రేణి రూ.14.69-21.45 లక్షలు. 1998లో టాటా సఫారీని తీసుకొచ్చామని.. ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా మరింత మెరుగు పరచి నూతన సఫారీని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ల్యాండ్ రోవర్కు చెందిన డి8 ప్లాట్ఫాం ఆధారంగా ఈ కొత్త సఫారీని తయారు చేసినట్లు.. భవిష్యత్లో ఆల్వీల్ డ్రైవ్, విద్యుదీకరణకు అనుగుణంగా ఇది ఉంటుందని తెలిపారు. అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.20.2 లక్షలు; రూ.21.45 లక్షల(ఆటోమేటిక్) వరకు ఉన్నాయని తెలిపారు. ఇపుడు విక్రయమవుతున్న మూడు కార్లలో ఒకటి ఎస్యూవీనేనని.. అందుకే ఈ విభాగంపై గట్టిగా దృష్టి పెట్టినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?