దిల్లీ: బీఎండబ్ల్యూ అనుబంధ ద్విచక్ర వాహన సంస్థ బీఎండబ్ల్యూ మోటార్డ్ నుంచి కొత్త క్రూయిజర్ బైక్ ఆర్ 18 క్లాసిక్ భారత విపణిలోకి మంగళవారం విడుదలైంది. దీని ధర రూ.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1,802 సీసీ ఇంజిన్‌తో రూపొంది, కంప్లీట్లీ బిల్టప్ యూనిట్ (సీబీయూ)గా దిగుమతి అయ్యింది. దీన్ని బీఎండబ్ల్యూ మోటార్డ్ డీలర్ నెట్వర్క్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా వెల్లడించారు. ఆర్ 18 క్లాసిక్‌లో లార్జ్ వైడ్‌స్క్రీన్, ప్యాసెంజర్ సీటు, శాడిల్ బ్యాగ్స్, ఎల్ఈడీ అదనపు హెడ్లైట్లు, 16 అంగుళాల ముందు చక్రం ఉంటాయి. మూడు ప్రామాణిక రైడింగ్ మోడ్లు - రెయిన్, రోల్, రాక్‌లతో ఇది లభ్యమవుతుంది. ట్రాక్షన్ నియంత్రణ, ఇంజిన్ బ్రేక్ నియంత్రణ, హిల్ స్టార్ట్ నియంత్రణ, కీలెస్ రైడ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ నియంత్రణ వంటి సదుపాయాలు ఈ బైక్ సొంతమని కంపెనీ తెలిపింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?