close

Published : 25/02/2021 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముక్కు ద్వారా ఇచ్చేకొవిడ్‌-19 టీకాపై ఉక్రెయిన్‌ ఆసక్తి

భారత్‌ బయోటెక్‌తో భాగస్వామ్యానికి సిద్ధం  

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకాలో భాగస్వామి కావడానికి ఉక్రెయిన్‌ ఆసక్తిగా ఉంది. అంతేగాక భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకా కొనుగోలుకూ  సిద్ధపడుతోంది. ఉక్రెయిన్‌ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మాక్సిమ్‌ స్టెపనోవ్‌ సారథ్యంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ టీకాల తయారీ సదుపాయాన్ని సందర్శించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకా (బీబీవీ 154) ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. ఉక్రెయిన్‌ ప్రతినిధి బృందం స్వయంగా ఇక్కడకు రావటం తమకు అత్యంత గౌరవప్రదమైన విషయమని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా విషయంలో పరస్పర భాగస్వామ్యం కుదుర్చుకునే అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని అన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని