close

Published : 26/02/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

3 నుంచి ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ

ధరల శ్రేణి రూ.574-575

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌ సేవల కంపెనీ ఎంటార్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) మార్చి 3న ప్రారంభమై, 5న ముగియనుంది. రూ.10 ముఖ విలువ కల ఒక్కో షేరును రూ.574-575 ధరకు జారీ చేయాలని ఈ కంపెనీ నిర్ణయించింది. కంపెనీ కొత్తగా 21,48,149 షేర్లు జారీ చేస్తుండగా, ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద 82,24,270 షేర్లు విక్రయిస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీకి రూ.124 కోట్లు, షేర్లు విక్రయిస్తున్న ప్రమోటర్లు- ఇన్వెస్టర్లకు రూ.473 కోట్లు లభిస్తాయి. దీని ప్రకారం ఇష్యూ పరిమాణం రూ.597 కోట్లు అవుతోంది. ఇష్యూ ద్వారా సమీకరించే సొమ్మును, అప్పులు తీర్చడానికి, నిర్వహణ అవసరాలకు కేటాయించనున్నట్లు కంపెనీ వివరించింది.  2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీ రూ.218 కోట్ల ఆదాయాన్ని, రూ.30 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని ఆర్జించింది. వార్షికాదాయాల్లో సగానికిపైగా విదేశీ కంపెనీల నుంచి లభింస్తోంది. కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.356 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. ఈ కంపెనీ పరిశుభ్ర ఇంధనం, నూక్లియర్‌, అంతరిక్షం- రక్షణ రంగాలకు అనువైన ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని