close

Published : 26/02/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఆర్‌సీటీసీలోనూ బస్‌ టికెట్ల బుకింగ్‌: అభిబస్‌

ముంబయి: ఆన్‌లైన్‌ ఇ-టికెటింగ్‌ సేవల సంస్థ అయిన అభిబస్‌, ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌) తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐఆర్‌సీటీసీ వినియోగదార్లకు బస్సు టిక్కెట్లు బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అభిబస్‌ అందిస్తుంది. తమ వినియోగదార్లకు దాదాపు లక్ష బస్సు రూట్లలో ఏసీ, నాన్‌-ఏసీ బస్సు టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు ఐఆర్‌సీటీసీ వివరించింది. ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యం వల్ల తాము ఇంకా ఎక్కువ మంది వినియోగదార్లకు సేవలు అందించగలుగుతామని అభిబస్‌ ముఖ్య వాణిజ్య అధికారి శశాంక కోనా వివరించారు. ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్‌ కోసం ప్రయత్నించినప్పుడు, వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంటే, ప్రత్యామ్నాయంగా ఆ మార్గంలో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులను సులభంగా బుక్‌ చేసుకునే వీలు వినియోగదార్లకు లభిస్తుందన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని