close

Published : 28/02/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశీయ విపణిలోకి సిత్రోయెన్‌

రేపటి నుంచి సీ5 ఎయిర్‌క్రాస్‌ బుకింగ్‌ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ  సిత్రోయెన్‌ భారత మార్కెట్లోకి తన తొలి ఎస్‌యూవీని విడుదల చేసింది. ‘సీ5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ’ని శనివారం నుంచి దేశంలోని 10 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. మార్చి 1 నుంచి హైదరాబాద్‌లోని లా మీసన్‌ సిత్రోయెన్‌ (ప్రైడ్‌ మోటార్స్‌) ఫిజిటల్‌ షోరూంలో రూ.50వేలు చెల్లించి, ఈ ఎస్‌యూవీని బుకింగ్‌ చేసుకోవచ్చు. తొలి వాహనాన్ని ఏప్రిల్‌ మొదటి వారంలో అందించే వీలుంది. సీ5 ఎయిర్‌క్రాస్‌ 2 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌, 8 గేర్ల ఆటోట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. లీటర్‌ డీజిల్‌కు 18.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. 12.3 అంగుళాల పూర్తి డిజటల్‌ తెర, సన్‌రూఫ్‌, సర్దుబాటు చేసుకునేందుకు వీలున్న వెనక సీట్లు, పూర్తి నిశ్శబ్దంగా ఉండే క్యాబిన్‌ దీని ప్రత్యేకతలు. ఇది ఫీల్‌, షైన్‌ అనే రెండు వేరియెంట్లలో లభించనుంది. దీని ఇంజిన్‌ 2000 ఆర్‌పీఎం వద్ద గరిష్ఠంగా 400 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కారు విడుదల సందర్భంగా సిత్రోయెన్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోలాండ్‌ బౌచారా మాట్లాడుతూ.. వినియోగదారులు 3డీ విధానంలో కారును 360 డిగ్రీల కోణంలో కారును పరిశీలించే వీలుందని పేర్కొన్నారు. ఫిజికల్‌, డిజిటల్‌ అనుసంధానం(ఫిజిటల్‌)తో షోరూంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీని ధర వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని