close

Published : 28/02/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బొమ్మల తయారీలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి

తయారీదార్లకు ప్రధాని సూచన

తొలి ఇండియా టాయ్‌ ఫెయిర్‌ ప్రారంభం

దిల్లీ: అంతర్జాతీయ విపణిలో దేశీయ బొమ్మల పరిశ్రమ వాటాను పెంచేందుకు కృషి చేస్తూనే.. వాటి తయారీలో ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాల్సిందిగా తయారీదార్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పర్యావరణహిత, పునర్వినియోగ (రీసైక్లబుల్‌) ఉత్పత్తులను మరిన్ని ఉపయోగించాలని తెలిపారు. మొట్టమొదటి ఇండియా టాయ్‌ ఫెయిర్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మల రంగంలో ఆత్మనిర్భరతను సాధించడమే కాకుండా ప్రపంచ దేశాలకు బొమ్మలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని అభిలషించారు. ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‌ డాలర్ల పరిమాణమున్న బొమ్మల పరిశ్రమలో భారత్‌ వాటా చాలా తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తుచేస్తూ.. దేశంలో వినియోగిస్తున్న బొమ్మల్లో 85 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి అయినవేనని పేర్కొన్నారు. మున్ముందు ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘మన వద్ద సాంప్రదాయాలు, సాంకేతికత ఉంది. నైపుణ్యం, సామర్థ్యాలకు కొదవలేదు. వీటన్నింటి అండతో పర్యావరణహిత బొమ్మల వైపు ప్రపంచాన్ని మనం తిరిగి తీసుకొని రావాల’ని ప్రధాని పేర్కొన్నారు. చేతితో తయారు చేసే (హ్యాండ్‌మేడ్‌) బొమ్మలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశీయంగా తయారుచేసే బొమ్మలకు గిరాకీ పెరిగితే.. చేతితో తయారు చేసే బొమ్మలకు కూడా వాటితో సమానంగా గిరాకీ పెరుగుతుందని పేర్కొన్నారు.

భారత్‌లో ఎయిర్‌బస్‌ విమానాల తయారీ!!:  భారత్‌లో విమానాల తయారీని ప్రారంభించేలా చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయెల్‌ పేర్కొన్నారు. దేశంలోనే తొలి టాయ్‌ ఫెయిర్‌ 2021లో జరిగిన సీఈఓల సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘చిన్నపుడు బొమ్మ విమానాలు తయారు చేసేవాడిని. బొమ్మల తయారీదారుగా మారాలనీ భావించా. అది వేరే విషయం. అయితే ప్రస్తుతం భారత్‌లో ఎయిర్‌బస్‌ తన విమానాల తయారీని ప్రారంభించేలా చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాన’ని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని