close

Published : 02/03/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ‘రేటింగ్‌’ పతనం

ఈనాడు, హైదరాబాద్‌: మౌలిక సదుపాయాల రంగ కంపెనీ గాయత్రీ ప్రాజెక్ట్స్‌ రేటింగ్‌ను ‘కేర్‌ రేటింగ్స్‌’ తగ్గించింది. ప్రస్తుతం ఉన్న ‘బి’  రేటింగ్‌ను, ‘డి’ రేటింగ్‌కు తగ్గిస్తున్నట్లు కేర్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. ఇది నాసిరకం రేటింగ్‌ కిందకు వస్తుంది. అప్పులు సకాలంలో తీర్చలేకపోవడమే దీనికి కారణమని వివరించింది. నష్టాలు పెరిగి, నికర విలువ క్షీణించడం కూడా ఈ పరిస్థితికి తావిచ్చినట్లు పేర్కొంది. ఈ కంపెనీకి ప్రస్తుతం దాదాపు రూ.3,000 కోట్లకు పైగా రుణభారం ఉంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని