close

Published : 02/03/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూచీలకు జీడీపీ జోరు

 750 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌
 14700 ఎగువకు నిఫ్టీ
సమీక్ష

ఇటీవలి భారీ నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. డిసెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇందుకు కారణమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌, సెప్టెంబరు త్రైమాసికాల్లో క్షీణించిన జీడీపీ మూడో త్రైమాసికంలో సానుకూలంగా నమోదుకావడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, అమెరికా బాండు రాబడులు గరిష్ఠాల నుంచి వెనక్కి రావడమూ కలిసొచ్చాయి. మెరుగైన వాహన విక్రయాలు, పీఎంఐ తయారీ గణాంకాలు సైతం దన్నుగా నిలిచాయి. స్పెక్ట్రమ్‌ వేలం నేపథ్యంలో టెలికాం షేర్లు డీలాపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు తగ్గి 73.55 వద్ద ముగిసింది.      
  సెన్సెక్స్‌ ఉదయం 49,747.71 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే జోరు కొనసాగించిన సూచీ.. 50,058.42 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు    749.85 పాయింట్ల లాభంతో 49,849.84 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 232.40 పాయింట్లు దూసుకెళ్లి 14,761.55 దగ్గర స్థిరపడింది.

29 షేర్లకు లాభాలు: సెన్సెక్స్‌ 30 షేర్లలో 29 లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ అత్యధికంగా 5.94 శాతం పరుగులు తీసింది. ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, కోటక్‌ బ్యాంక్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ, టెక్‌ మహీంద్రా 5% వరకు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఒక్కటే  4.45% నష్టపోయింది.
* బీఎస్‌ఈలో మదుపర్ల సంపద రూ.2.95 లక్షల కోట్లు పెరిగి,  రూ.203.76 లక్షల కోట్లకు చేరింది.
ఎన్‌ఎస్‌ఈలో మళ్లీ సాంకేతిక లోపం
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లో మళ్లీ సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం ఎన్‌ఎస్‌ఈ క్యాష్‌ విభాగంలో ఆర్డర్లకు సంబంధించిన ధ్రువీకరణ తమకు అందడం లేదంటూ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక సమస్య తలెత్తిందంటూ ఉదయం గం. 10:01 కు ట్వీట్‌ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.. ‘ఉదయం 9:50కు సమస్య పరిష్కారం అయిందంటూ గం.11:53కు ట్వీట్‌ చేసింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని