close

Updated : 03/03/2021 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బైక్‌ బ్యాటరీల ఛార్జింగ్‌ 15 నిమిషాల్లోపే

బెంగళూరు అంకుర సంస్థ ఆవిష్కరణ

బెంగళూరు: ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్‌ వాహనాల బ్యాటరీలను 15 నిమిషాల్లోపే పూర్తిగా ఛార్జింగ్‌ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘లాగ్‌ 9 మెటీరియల్స్‌’ ఆవిష్కరించింది. వేగంగా ఛార్జింగ్‌ అయ్యే బ్యాటరీని అభివృద్ధి చేయడానికి సూపర్‌కెపాసిటర్‌ టెక్నాలజీ, ‘గ్రాఫీన్‌’ను వినియోగించినట్లు లాగ్‌ 9 బృందం వెల్లడించింది. ఈ బ్యాటరీని ఒకసారి పూర్తి ఛార్జింగ్‌ చేసేందుకు 15 నిముషాల కంటే తక్కువ సమయమే సరిపోతుందని, 15 ఏళ్లకు పైగా పనిచేస్తాయని తెలిపింది. ఇందువల్ల వాహన నిర్వహణ వ్యయం కూడా బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీలతో పోలిస్తే ఇవి 5 రెట్ల వరకు ఎక్కువ శక్తిని ఇస్తాయని, అగ్నిప్రమాదాల నిరోధంలో 5 రెట్లు అధిక భద్రమైనవని సంస్థ వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) ముగిసేనాటికి 3000కు పైగా వాహనాల్లో, 2022-23 నాటికి 20,000కు పైగా వాహనాల్లో ఈ బ్యాటరీలను అమర్చాలని ఐఐటీ రూర్కీలో రూపుదిద్దుకున్న లాగ్‌ 9 లక్ష్యంగా పెట్టుకుంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని