close

Published : 03/03/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.77,815 కోట్ల స్పెక్ట్రమ్‌ అమ్మకం

సగానికి పైగా రేడియో తరంగాలు జియోకే

దిల్లీ: ప్రభుత్వం రెండు రోజులుగా చేపట్టిన వేలంలో సగానికి పైగా స్పెక్ట్రమ్‌ ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోనే దక్కించుకుంది. రూ.57,122.65 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను ఇది పొందింది. మరో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ రూ.18,699 కోట్ల స్పెక్ట్రమ్‌కు బిడ్‌ దాఖలు చేసింది. 855.60 మెగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీలో 355.45 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంది. వొడాఫోన్‌ ఐడియా 5 జోన్లలో 11.8 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.1993.40 కోట్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిందని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ మంగళవారమిక్కడ తెలిపారు. వేలానికి ఉంచిన స్పెక్ట్రమ్‌లో 60 శాతం వరకు విక్రయమయిందని ప్రకాశ్‌ తెలిపారు. అయితే 700 మెగాహెర్ట్జ్‌, 2500 మెగాహెర్ట్జ్‌ బాండ్‌లు విక్రయం కాలేదు. రెండు రోజుల వేలంలో రూ.77,814.80 కోట్ల విలువైన 855.60 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ అమ్ముడుపోయిందని ఆయన వివరించారు. మొత్తమంతా ప్రాథమిక ధర(రిజర్వ్‌ ప్రైస్‌) వద్దే విక్రయమయ్యాయి. దీంతో ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.19,000-20,000 కోట్లు; వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.6000-7000 కోట్లు లభిస్తుంది. ప్రభుత్వం మొత్తం ఏడు బాండ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువైన 2308.80 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అందుబాటులో ఉంచింది. 22 సర్కిళ్లలో ఉపయోగించదగ్గ స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేశామని, 5జీ సాంకేతికతకు ఇది సరిపోతుందని జియో వివరించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని