close

Published : 06/03/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షిప్త వార్తలు


ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు అధిక స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు సంస్థాగతేతర మదుపరుల (నాన్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల) నుంచి అధిక స్పందన లభించింది. ఐపీఓ మూడోరోజైన శుక్రవారం నాటికి రిటైల్‌ విభాగంలో 28.4 రెట్లు అధిక చందా (సబ్‌స్క్రిప్షన్‌) లభించగా, సంస్థాగతేతర మదుపరుల నుంచి అత్యధికంగా 650.79 రెట్లు అధిక చందా లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్లు 164.99 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ.575 షేరు ధరకు ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ చేస్తోంది. తద్వారా రూ.597 కోట్లు సమీకరించదలచింది.


ఐసీఐసీఐ బ్యాంక్‌ గృహరుణ రేటు 6.7 శాతం

ముంబయి: గృహ కొనుగోలుదార్లకు శుభవార్త. ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా గృహ రుణాలపై వడ్డీ రేటును 6.7 శాతానికి తగ్గించింది. ఈనెల 5 నుంచి 31లోపు తీసుకునే రుణాలకే ఈ రేటు అమల్లో ఉండనుందని బ్యాంక్‌ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.75 లక్షల్లోపు గృహ రుణాలు తీసుకునే వారికి 6.7 శాతానికి, అంతకు మించిన మొత్తాలు తీసుకునే వారికి 6.75 శాతం చొప్పున రుణాలు అందించనుంది.  


ఉద్యోగుల టీకా వ్యయం మాదే: ఆర్‌ఐఎల్‌

ముంబయి: తమ గ్రూప్‌లోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 12.2 లక్షల మందికి  కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేసేందుకు అయ్యే ఖర్చులను భరించనున్నట్లు ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ఉద్యోగుల కుటుంబీకులకు టీకా వేసి, భద్రత కల్పించడం బాధ్యతగా భావిస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తెలిపారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని