close

Published : 06/03/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ కన్నుమూత

దిల్లీ: ముత్తూట్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఎంజీ జార్జ్‌ ముత్తూట్‌ (71) శుక్రవారం రాత్రి దిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. మెట్లపై నుంచి జారి పడటమే ఇందుకు కారణమని సమాచారం. ఈయనకు భార్య సారా జార్జ్‌, ఇద్దరు కుమారులు జార్జ్‌ ఎం.జార్జ్‌ (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌), అలెగ్జాండర్‌ జార్జ్‌ (గ్రూప్‌ డైరెక్టర్‌) ఉన్నారు. ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌గా ఆయన కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు జార్జ్‌. 1979లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన 1993లో గ్రూప్‌ ఛైర్మన్‌గా మారారు. దేశంలోనే అతి పెద్ద పసిడి ఆభరణాల తనఖా రుణాల కంపెనీ అయిన ముత్తూట్‌ ఫైనాన్స్‌కు 5,000 శాఖలు ఉన్నాయి.ఇంకా 20కి పైగా వ్యాపారాలకు మరో 550 శాఖలున్నాయి. ఫిక్కీ జాతీయ కార్యవర్గ కమిటీలో సభ్యుడిగా, ఫిక్కీ కేరళ రాష్ట్ర కౌన్సిల్‌ ఛైర్మన్‌గానూ జార్జ్‌ ముత్తూట్‌ వ్యవహరిస్తున్నారు. ఫోర్బ్స్‌ ఆసియా మ్యాగజైన్‌ ఇండియా సంపన్నుల జాబితా ప్రకారం, 2011లో ఈయన భారత్‌లో 50వ స్థానంలో ఉన్నారు. 2020కి ర్యాంకింగ్‌ మెరుగుపరచుకుని 500 కోట్ల డాలర్ల సంపదతో 44వ స్థానానికి చేరారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని