నీతా అంబానీ హర్ సర్కిల్
దిల్లీ: మహిళా సాధికారతే లక్ష్యంగా సామాజిక మాధ్యమ వేదిక హర్సర్కిల్ను ప్రారంభించినట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఆదివారం ప్రకటించారు. మహిళలకు సంబంధించి అన్ని అంశాల (కంటెంట్)కు ఇది వేదికగా నిలవాలన్నది లక్ష్యమని తెలిపారు. హర్సర్కిల్.ఇన్ ద్వారా లక్షల మంది మహిళలకు మద్దతుగా నిలుస్తామని, ఇందుకోసం ప్రతి మహిళ ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో చేరొచ్చని నీతా అంబానీ చెప్పారు. ఏ దేశం వారైనా, ఏ మతం, సంస్కృతికి చెందిన మహిళలైనా వినూత్న ఆలోచనలు పంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై చదువుకోవచ్చు, వీడియోలు వీక్షించవచ్చు, జీవనశైలి, ఆర్థిక, వ్యక్తిగత అభివృద్ధి, పనితీరుకు సంబంధించి మెళకువలు తెలుసుకోవచ్చు.
Tags :
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?