విక్రయానికి 13 విమానాశ్రయాలు!
close

Published : 18/03/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విక్రయానికి 13 విమానాశ్రయాలు!

నష్టాల్లో నడుస్తున్నవి.. లాభాల్లో ఉన్నవి కలిపే
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు

 

నష్టాల్లో నడుస్తున్నవి ఏడు : సేలం, ఝార్సుగూడ,  జబల్‌పుర్‌, జల్‌గావ్‌, కాంగ్రా, కుషినగర్‌, గయ 

లాభాల్లో : ఉన్నవి ఆరు తిరుచి, భువనేశ్వర్‌, ఇండోర్‌, రాయ్‌పుర్‌, అమృత్‌సర్‌, వారణాసి

దిల్లీ: నష్టాల్లో నడుస్తున్న విమానాశ్రయాలను విక్రయానికి పెడితే, కొనేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. అందుకే లాభాల్లో ఉన్న వాటితో కలిపి గంపగుత్తగా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. అప్పుడైతే సామర్థ్యం ఉన్న బిడ్డర్లు ముందుకు వస్తారనే భావనతో ప్రభుత్వం ఉందని ఓ అధికారి వెల్లడించారు. ఈ విధంగా నష్టాలు-లాభాల్లో ఉన్న 13 విమానాశ్రయాలను కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం విక్రయించనుందని తెలిపారు. ‘విమానాశ్రయాల విక్రయ ప్రతిపాదన పెట్టాం..వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటికి బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉంద’ని ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. నష్టాల్లో-లాభాల్లో ఉన్న విమానాశ్రయాలకు కలిపి బిడ్‌ వేయాల్సి ఉంటుంది.  
రూ.20000 కోట్ల సమీకరణ కోసమే..: ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.20000 కోట్లు సమీకరించాలన్నది విమానయాన శాఖ లక్ష్యం. 2019లో ఆరు విమానాశ్రయాలకు నిర్వహించిన వేలంలో అదానీ పోర్ట్స్‌ అన్నింటినీ దక్కించుకుంది. ఈ 6 విమానాశ్రయాల విక్రయ సమయంలో అమలు చేసిన షరతులనే ప్రతిపాదిత 13 విమానాశ్రయాల విక్రయానికీ ప్రభుత్వం వర్తింపచేసే అవకాశం ఉంది


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని