డీఎస్‌టీకి బదులుగా భారత వస్తువులపై పన్ను!
close

Published : 28/03/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డీఎస్‌టీకి బదులుగా భారత వస్తువులపై పన్ను!

ప్రతీకార వర్తక చర్యలకు సిద్ధమవుతున్న అమెరికా

దిల్లీ: మనదేశంతో పాటు ఇటలీ, టర్కీ, యూకే, స్పెయిన్‌ తదితర దేశాలపై ప్రతీకార వర్తక చర్యలకు అమెరికా సిద్ధం అవుతోంది. ఇ-కామర్స్‌ సేవలపై ఈ దేశాలు పన్ను విధించటాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. అందుకు బదులుగా ప్రతీకార వర్తక చర్యలను యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రెజెంటేటివ్‌ (యూఎస్‌టీఆర్‌) ప్రతిపాదించారు. ‘ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ టాక్స్‌’ పై యూఎస్‌ ట్రేడ్‌ యాక్ట్‌లోని 301 సెక్షన్‌ కింద గత ఏడాది జూన్‌లో అమెరికా విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం అమెరికాకు చెందిన డిజిటల్‌ సేవల కంపెనీలపై పక్షపాతం చూపించేదిగా ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. కానీ ఈ వాదనను భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. అయినప్పటికీ ప్రతీకార చర్యలకే అమెరికా మొగ్గుచూపుతోంది. ‘విచారణలో తేలిన అంశాల అధారంగా, 301 సెక్షన్‌ కింద అమెరికా యూఎస్‌టీఆర్‌ ప్రతీకార చర్యలు ప్రతిపాదించింది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే చేపలు- రొయ్యలు వంటి  సముద్ర ఉత్పత్తులు, వెదురు, వజ్రాలు- రత్నాలు, ఫర్నిచర్‌, సిగరెట్‌ పేపర్‌... తదితర ఉత్పత్తులపై అదనంగా యాడ్‌-వెలారమ్‌ పన్నులు విధించే అవకాశం ఉంది. యూఎస్‌ కంపెనీల నుంచి మనదేశం ఎంతమేరకు డీఎస్‌టీ (డిజిటల్‌ సర్వీసెస్‌ టాక్స్‌) వసూలు చేస్తుందో... దాదాపు అంతే మొత్తాన్ని మనదేశం నుంచి వచ్చే వస్తువులపై పన్ను రూపంలో వసూలు చేయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం మనదేశంలో యూఎస్‌ కంపెనీల నుంచి వసూలు చేసే డీఎస్‌టీ ఏటా 5.5 కోట్ల డాలర్ల మేరకు ఉంటుందని భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని