close

Published : 08/04/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీ5 ఎయిర్‌క్రాస్‌

ఎస్‌యూవీ రూ.29.9 లక్షలు

దిల్లీ: అంతర్జాతీయ వాహన దిగ్గజాలు ఎఫ్‌సీఏ, పీఎస్‌ఏ విలీనంతో ఏర్పాటైన స్టెల్లాంటిస్‌ గ్రూప్‌లో భాగమైన సిట్రోయెన్‌ నుంచి సీ5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ బుధవారం దేశీయ విపణిలోకి విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.29.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). ఇందులో 3 వేరియంట్లు ఉన్నాయని, వీటి ధరలు రూ.29.9 లక్షలు, రూ.30.4 లక్షలు, రూ.31.9 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మోడల్‌ ఎస్‌యూవీలను 2-లీటర్‌ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌, 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించినట్లు పేర్కొంది. లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపింది. ‘సిట్రోయెన్‌ సీ5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ మార్కెట్‌ అంచనాలను మించి ఉంది. దీని డిజైన్‌, సౌకర్యం, రూమీనెస్‌, పరికరాలు, పవర్‌ట్రెయిన్‌.. ఇలా ప్రతిదీ భారతీయ ఖాతాదారులను సంతృప్తిపరిచేలా ఉంది. ఆధునిక సాంకేతికతతో ప్రపంచ శ్రేణి ఉత్పత్తిని తీసుకొచ్చామ’ని కంపెనీ సీఈఓ విన్సెంట్‌ కోబీ వెల్లడించారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని