close

Updated : 11/04/2021 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌లో సీసీఎల్‌ బేవరేజస్‌ విలీనం

ఈనాడు, హైదరాబాద్‌: ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ సంస్థ అయిన సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌, తన సబ్సిడరీ కంపెనీని తనలో విలీనం చేసుకోనుంది. సీసీఎస్‌ ప్రోడక్ట్స్‌కు చిత్తూరు జిల్లా వరదాయపాలెం మండలంలో సీసీఎల్‌ బేవరేజస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే పేరుతో ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. ఇది కూడా ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీలో నిమగ్నమైన సంస్థే. ప్రధానంగా ఎగుమతుల కోసం ఉద్దేశించిన ప్లాంటు ఈ కంపెనీ కింద ఉంది. దీనిని ఇప్పుడు మాతృ సంస్థలో విలీనం చేయబోతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకొని వాటాదార్ల అనుమతి, ఇతర చట్టపరమైన అనుమతులు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యాపార కార్యకలాపాలు సమర్థంగా కొనసాగించేందుకు, వ్యయాలు తగ్గించటానికి, ఇతర ప్రయోజనాల కోసం సబ్సిడరీ కంపెనీని విలీనం చేయాలని సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌ యాజమాన్యం నిర్ణయించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని