close

Updated : 11/04/2021 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ వాటాదార్లలో డాలీ ఖన్నా, ముకుల్‌ అగర్వాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లో కొంతమంది పెద్ద ఇన్వెస్టర్లను రిటైల్‌ మదుపరులు అనుసరిస్తూ ఉంటారు. ఇందుకోసం పెద్ద ఇన్వెస్టర్లు ఏ షేర్లు కొనుగోలు చేస్తున్నారనేది పరిశీలిస్తూ ఉంటారు. ఆ కోవలోకి వచ్చే అగ్రశ్రేణి ఇన్వెస్టర్లు డాలీ ఖన్నా, ముకుల్‌ అగర్వాల్‌ హైదరాబాద్‌కు చెందిన న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ షేర్లను ఇటీవల కొనుగోలు చేసినట్లు తెలిసింది. బల్క్‌ ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) తయారు చేసే ఈ కంపెనీ వాటాదార్ల జాబితాలో ఈ ఇద్దరి పేర్లు కనిపిస్తున్నాయి. మార్చి 31, 2021 నాటికి న్యూలాండ్‌ లేబొరేటరీస్‌లో ముకుల్‌ అగర్వాల్‌కు 2.34 శాతం (3 లక్షల షేర్లు) వాటా, డాలీ ఖన్నాకు 1.26 శాతం (1,61,336 షేర్లు) వాటా ఉంది. అదే సమయంలో డిసెంబరు 31, 2020 నాటికి చూస్తే ముకుల్‌ అగర్వాల్‌కు ఈ కంపెనీలో ఉన్నది 2,50,236 షేర్లు మాత్రమే. గత మూడు నెలల్లో కొత్తగా మరికొన్ని షేర్లు కొనుగోలు చేయడంతో, ఈ కంపెనీలో ముకుల్‌ అగర్వాల్‌ వాటా పెరిగినట్లు స్పష్టమవుతోంది. డాలీ ఖన్నా కూడా గత మూడు నెలల్లో న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ షేర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని