close

Published : 12/04/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ యూనిట్‌ హోల్డర్లకు రూ.2962 కోట్ల చెల్లింపులు నేటినుంచి

దిల్లీ: ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆపేసిన 6 పథకాలకు సంబంధించి, యూనిట్లు కలిగి ఉన్న వారికి రెండో విడత చెల్లింపులను ఈ వారంలో చేయనున్నారు. ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ బాధ్యతలను (లిక్విడేటర్‌ హోదాలో) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండో విడత చెల్లింపుల కింద యూనిట్‌ హోల్డర్లకు రూ.2,962 కోట్లు చెల్లించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది వరకే ఒకసారి రూ.9,122 కోట్లను మదుపర్లకు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీ చేసింది. నో యువర్‌ కస్టమర్‌ (కేవేసీ) ఖాతా వివరాలు అందుబాటులో ఉన్న మదుపర్లందరికీ ఈ నెల 12 నుంచి చెల్లింపులు చేస్తామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని