close

Updated : 12/04/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

49150 దిగువన బలహీనం!

సమీక్ష: మిశ్రమ సంకేతాలు, బాండ్‌లపై ప్రతిఫలాలు పెరుగుతున్న నేపథ్యంలో గత వారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పులు చేయకపోవడం, కొవిడ్‌-19 కేసుల విజృంభణతో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించడం, వ్యాక్సిన్‌ కొరత తలెత్తొచ్చన్న వార్తలు మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 2.9 శాతం తగ్గి 63 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి
74.7కు బలహీనపడింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.9 శాతం నష్టంతో 49,591 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 0.2 శాతం తగ్గి 14,835 పాయింట్ల దగ్గర స్థిరపడింది.  విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.2340 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.1154 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.929 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈక్విటీల్లో రూ.740 కోట్లు, డెట్‌ విభాగంలో రూ.189 కోట్లు మేర వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:3గా నమోదు కావడం..
ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా : కీలక నిరోధ స్థాయి 50,300 వద్ద స్థిరీకరణ జరగడంతో, సెన్సెక్స్‌ గత వారం నష్టాల్లో ముగిసింది. స్వల్పకాలంలో 50,300 ఎగువకు చేరితేనే, సూచీ మళ్లీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ నష్టాలొస్తే.. 49,150 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, అనంతరం 48,580 పాయింట్ల వద్ద కీలక మద్దతు దక్కొచ్చు.

ప్రభావిత అంశాలు : అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. కొవిడ్‌-19 కేసులు, లాక్‌డౌన్‌లు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన వార్తలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపనున్నాయి. బుధవారం అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, మార్చి రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం, ఎగుమతులు- దిగుమతులు, వాణిజ్య లోటు గణాంకాలు విడుదల కానున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా వినియోగదారు ద్రవ్యోల్బణం, యూరో పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ వృద్ధి గణాంకాలపై ఓ కన్నేయొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 49,093, 48,580, 48,236
తక్షణ నిరోధ స్థాయులు: 50,300, 50,858, 51,822
సెన్సెక్స్‌ 49,150 దిగువన ముగిస్తే మరింత బలహీనపడొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని