close

Published : 12/04/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పసిడి సానుకూలంగానే!

కమొడిటీస్‌
ఈ వారం


బంగారం, వెండి

సిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూలంగానే కన్పిస్తోంది. అయితే మరింతగా రాణించాలంటే రూ.47,683 స్థాయిని అధిగమించాల్సి ఉంటుంది. ఒకవేళ కిందకు వస్తే రూ.45,364 వద్ద మద్దతు లభించే అవకాశం ఉంది. తక్కువ రిస్క్‌తో ట్రేడ్‌ చేసే మదుపర్లు రూ.44,896 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.45,746 సమీపంలో కొనుగోలు చేయొచ్చు.  
* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.14,228 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే రూ.14,606: రూ.14,700 వరకు పెరుగుతుందని భావించవచ్చు. వెండి మే ఫ్యూచర్‌ కాంట్రాక్టు 65,044 స్థాయిని నిలబెట్టుకోకపోతే రూ.63,127కి పడిపోవచ్చు.


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.14,142 స్థాయి కంటే కిందకు రాకుంటే సానుకూల ధోరణి కొనసాగొచ్చు.  రాగి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.693.40 కంటే ఎగువన ముగిస్తే మరింతగా పెరుగుతుందని భావించవచ్చు. రూ.737 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. సీసం ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.162.05 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. జింక్‌ ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.229.35 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అల్యూమినియం ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.186.45 స్థాయిని అధిగమించకుంటే షార్ట్‌ సెల్లింగ్‌ చోటుచేసుకోవచ్చు.  నికెల్‌ ఈవారం రూ.1,225 కంటే దిగువన ట్రేడయితే రూ.1,209 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది.


ఇంధన రంగం

* సహజవాయువు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.196.15 స్థాయికి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ రూ.185.05 కంటే కిందకు వస్తే   రూ.180.90 వరకు దిద్దుబాటు కావచ్చు.
* ముడి చమురు ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.4,588 స్థాయిని అధిగమిస్తే రూ.4,662 వరకు వెళుతుందని భావించవచ్చు.  
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం రూ.1,146- రూ.1,156 వరకు పెరిగే అవకాశం ఉంది.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు మే కాంట్రాక్టు ఈవారం రూ.8,239 స్థాయి కంటే కిందకు వస్తే రూ.8,049 వరకు పడిపోయే అవకాశం ఉంది. జీలకర్ర మే ఫ్యూచర్‌ కాంట్రాక్టులో ఈవారం కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. ధనియాలు మే కాంట్రాక్టు ఈవారం రూ.7,170 కంటే దిగువన ట్రేడయితే షార్ట్‌ సెల్లింగ్‌కు ఆస్కారం ఉంది.  సోయాబీన్‌ మే కాంట్రాక్టుకు ఈవారం రూ.6,594 దరిదాపులో గట్టి నిరోధం ఎదురు కావచ్చు. 

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని