close

Published : 17/04/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మైండ్‌ ట్రీ డివిడెండ్‌ 175%

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఐటీ సంస్థ మైండ్‌ ట్రీ ఏకీకృత ప్రాతిపదికన రూ.317.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.206.2 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 53.9 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.2050.5 కోట్ల నుంచి 2.9 శాతం వృద్ధితో రూ.2109.3 కోట్లకు చేరింది. డాలర్ల ప్రాతిపదికన చూస్తే.. కంపెనీ నికర లాభం 53.4 శాతం పెరిగి 43.3 మిలియన్‌ డాలర్లకు, ఆదాయం 3.5 శాతం అధికమై రూ.288.2 మిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందింది. ‘మరో బలమైన త్రైమాసికాన్ని నమోదుచేశాం. అంతర్జాతీయంగా ఖాతాదారు పోర్ట్‌ఫోలియో పెరగడంతో ఆదాయం 5.2 శాతం, ఎబిటా 219 శాతం పెరిగింది. నాలుగో త్రైమాసికం ముగిసేసరికి ఆర్డరు పుస్తకం 375 మిలియన్‌ డాలర్లుగా ఉంది’ అని మైండ్‌ ట్రీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దేవశిష్‌ ఛటర్జీ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధిస్తామని వెల్లడించారు. ఒక్కో షేరుకు రూ.17.5 (175 శాతం) తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది.
* పూర్తి ఆర్థిక సంవత్సరం (2020-21)లో మైండ్‌ ట్రీ లాభం 76 శాతం పెరిగి రూ.1110.5 కోట్లకు, ఆదాయం 2.6 శాతం అధికమై రూ.7,967.8 కోట్లకు చేరింది.
* మార్చి ఆఖరుకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 23,814గా నమోదైంది. వలసల రేటు 12.1 శాతంగా ఉంది. క్రియాశీల ఖాతాదారుల సంఖ్య 270.
* ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు దశలవారీగా కొవిడ్‌-19 టీకా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని