హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 16% వృద్ధి
close

Published : 18/04/2021 02:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 16% వృద్ధి

జనవరి- మార్చిలో రూ.8,434 కోట్లు

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.8,434 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,280 కోట్లతో పోలిస్తే లాభం 15.8 శాతం పెరగడం గమనార్హం. మొత్తం ఏకీకృత ఆదాయం కూడా రూ.38,287.17 కోట్ల నుంచి రూ.40,909.49 కోట్లకు పెరిగింది. మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2020-21) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 16.8 శాతం వృద్ధితో రూ.31,833 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.1,47,068.28 కోట్ల నుంచి రూ.1,55,885.28 కోట్లకు పెరిగింది. మార్చి 31 నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మొత్తం రుణాల్లో 1.32 శాతంగా ఉంది. కిందటేడాది ఇదే సమయంలోని 1.26 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. విలువ ప్రకారం చూస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు రూ.12,649.97 కోట్ల నుంచి రూ.15,086 కోట్లకు పెరిగాయి. నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి కూడా 0.36 శాతం (రూ.3,542.36 కోట్లు) నుంచి 0.40 శాతానికి (రూ.4,554.82 కోట్లు) పెరిగింది. మొండి బకాయిలు, ఇతరత్రా అవసరాలకు కేటాయింపులు రూ.3,784.49 కోట్ల నుంచి రూ.4,693.70 కోట్లకు పెరిగాయి. 2021 మార్చి చివరినాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన మంజూరు చేసిన రుణాలు 13.6 శాతం పెరిగి రూ.11,85,284 కోట్లకు చేరాయి. 2020 మార్చి చివరినాటికి ఇవి రూ.10,43,671 కోట్లుగా ఉన్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని