close

Updated : 19/04/2021 08:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీడీపీ అంచనాల్లో కోత

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థల మార్పులివీ

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆర్థిక రికవరీ మందగించే అవకాశం ఉందని భావిస్తున్న ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించాయి. స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడి, రికవరీ నెమ్మదిస్తుందని అందుకే జీడీపీ వృద్ధి అంచనాల్ని తగ్గిస్తున్నామని తెలిపాయి. వివిధ బ్రోకరేజీ సంస్థల అంచనాలు ఇలా..
* కరోనా మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరాల్లో కూడా దేశ జీడీపీ తగ్గుతూ వచ్చింది. 2016-17లో 8.3 శాతం వృద్ధి నమోదు చేయగా, 2017-18లో 6.8 శాతం, 2018-19లో 6.5 శాతం, 2019-20లో 4 శాతంగా నమోదైంది. కరోనా ప్రవేశించిన 2020-21లో వృద్ధి మాట అటుంచితే, 8 శాతం మేర క్షీణించిందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పరిశోధనా సంస్థలన్నీ భావిస్తున్నాయి. బేస్‌ ఎఫెక్ట్‌ ప్రభావంతో ఇది సాధ్యమే.తాజాగా కొవిడ్‌ కేసులు రోజుకు 2 లక్షలకు పైగా నమోదవుతున్నందున, మళ్లీ అంచనాలు తగ్గిస్తున్నాయి. అయితే జూన్‌ ఆఖరుకు సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే అభిప్రాయాన్ని యూబీఎస్‌ వ్యక్తం చేసింది.  రిజర్వ్‌ బ్యాంక్‌ 10.5 శాతం, ఐఎంఎఫ్‌ 12.5%, ప్రపంచ బ్యాంక్‌ 10.1% వృద్ధి అంచనాలు వెలువరించాయి.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని